స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
ఆత్మకూరు, కాకతీయ : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూర్ మండంలోని గూడెప్పాడ్ ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఇనగాల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, సోషల్...