విద్య, మౌలిక సదుపాయాలను పెంపొందించాలి: గోవాలో వరంగల్ ఎంపీ కావ్య ప్రజెంటేషన్

కాకతీయ, వరంగల్ బ్యూరో : గోవా రాష్ట్రంలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజిటల్ లింగభేదం, మహిళల ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డా. కావ్య మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్‌ఫోన్ వినియోగంలో 13% తేడా ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా...