కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ.. దాని గురించేనా?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. ఈ క్రమంలో కీలక నేతలు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హరీశ్ రావు, కేసీఆర్ మధ్య జరిగిన ఈ సమావేశం కూడా అలాంటి పరిణామాల్లో భాగమేనని భావిస్తున్నారు. పార్టీ బలపరిచే దిశగా, కేడర్ ఉత్సాహాన్ని పెంచేలా ఏ...