హైదరాబాద్ వినాయకుడు అట్లుంటది మరి..రూ. 2.32కోట్లు పలికిన గణపతి లడ్డూ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గణపతి ఉత్సవం సందర్భంగా లడ్డూ వేలం ఎప్పటిలాగే విశేష ఆకర్షణగా మారాయి. ప్రత్యేకంగా బండ్లగూడా జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవంలో ప్రసాద లడ్డు వేలం ఊహించని రీతిలో రికార్డు సృష్టించింది. ఆ లడ్డు రూ. 2.32 కోట్లుకు అమ్ముడై, ఈ సీజన్‌లోనే అత్యంత ఖరీదైన గణపతి లడ్డుగా నిలిచింది. ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల సమయంలో లడ్డూ వేలంపాట ఒక పెద్ద సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈసారి కూడా కీర్తి రిచ్‌మండ్ విల్లా...