గణపతి నిమజ్జనోత్సవాలు భేష్:కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు పాటుపడిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సహా అన్ని శాఖల సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు....