హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ రాకెట్..12 మంది అరెస్ట్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. రసాయన ఫ్యాక్టరీ పేరుతో అక్రమంగా మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా దొంగచాటుగా దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ డ్రగ్) ముడి రసాయనాలు స్వాధీనం కావడంతో సంచలనం రేపింది. మహారాష్ట్రలోని మీరా-భయందర్, వసాయి-విరార్ (MBVV) పోలీసులు కొన్నాళ్లుగా ఓ అంతర్జాతీయ స్థాయి డ్రగ్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టారు. గూఢచారులను...