గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడి చిత్రమాలిక.. ఎక్స్ క్లూజివ్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఖైరతాబాద్ బడా వినాయకుడి నిమజ్జన కార్యక్రమం శనివారంతో విజయవంతంగా పూర్తయింది. ఖైరతాబాద్ బడాగణేష్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ప్రతి సంవత్సరం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ మహా వినాయక విగ్రహం, ఈసారి కూడా విశేషంగా అలరించింది. 63 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం హైదరాబాద్ నగరానికి ప్రత్యేక శోభనిచ్చింది. నిమజ్జనం చివరి రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన హైడ్రాలిక్...