మ‌హా శ‌క్తి గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవోపేతంగా సాగింది. ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 1:40 నిముషాల‌కు హుస్సేన్ సాగ‌ర్‌లో మ‌హాగ‌ణ‌ప‌తిని నిమ‌జ్జ‌నం చేశారు. మ‌హా గ‌ణ‌ప‌తిని క‌నులారా వీక్షించేందుకు మ‌హాన‌గ‌ర ప్ర‌జ‌లు ల‌క్ష‌లాదిగా ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల‌కు చేరుకున్నారు. దీంతో ఇసుకేస్తే రాల‌నంత జ‌నంతో ట్యాంక్ బండ్ ప‌రిస‌రాలు కిక్కిరిసిపోయాయి. అదే స‌మయంలో గ‌ణ‌ప‌తుల‌ను...