ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా మార్చాలి: కలెక్టర్ పమేలా సత్పతి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆధునికంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని పారదర్శకంగా సద్వినియోగం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియంను శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురాతన పాఠశాల తరగతులను పక్కనున్న...