వేములవాడ ఆసుపత్రికి అంబులెన్స్.. సొంత నిధులతో అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కాక‌తీయ‌, వేముల‌వాడ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన సొంత నిధులతో వేములవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అంబులెన్స్ ను అందించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వెహికల్ ఇంఛార్జీ సాంబాయిపల్లి శ్రీనివాసరెడ్డి శ‌నివారం అంబులెన్స్ తోపాటు వాటికి సంబంధించిన పత్రాలను వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. బండి సంజయ్ గతంలోనూ వేములవాడ సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్దఎత్తున...