ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆరు దేవాలయాలకు రూ.4.35 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో సురేఖ మాట్లాడుతూ మట్టేవాడ భోగేశ్వర స్వామి...