బీహార్ లో అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ నజర్.. ఆ తర్వాతే సీట్ల పంపకాలు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంపై నజర్ పెట్టింది. ఆ తర్వాత మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలని కమల పార్టీ భావిస్తోంది. దీర్ఘకాలంగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండటంతో రాష్ట్రంలో సహజంగా నెలకున్న వ్యతిరేకత కూడా బీజేపీకి ఇబ్బందిగా మారింది. గతవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను ముగించేందుకు...