వనంలో కాదు.. కరెంటు తీగలపై పక్షుల గూళ్లు!

కాకతీయ, ములుగు : అడవుల్లోని చెట్లపై కాకుండా, కరెంటు తీగలపై తమ గూళ్ళను కట్టుకున్న పక్షులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ములుగు జిల్లాలో ఏటూరునాగారం అభయారణ్యంలో తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం పరిసరాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా పక్షులు భారీ వృక్షాల్లో, చెట్ల కొమ్మలకు తమ గూళ్ళను కట్టుకోవడం సహజం. కానీ ఇక్కడి పక్షులు మాత్రం చెట్లకు బదులుగా విద్యుత్ తీగలను ఆశ్రయించాయి. గాలికి ఊగుతూ, వర్షం తట్టుకుని, కరెంటు తీగలపైనే తమ ఆవాసాన్ని ఏర్పరుచుకోవడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు....