పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత: దాస్యం వినయ్ భాస్కర్

కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపెల్లికి చెందిన చిన్నారులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి గణేష్ నవరాత్రుల్లో ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆ చిన్నారుల సృజనాత్మకతను ప్రశంసించారు. మడిపెల్లి చిన్నారుల మండపాన్ని గణేష్ నవరాత్రుల సమయంలో సందర్శించిన ఆయన ఆదివారం వడ్డేపల్లి నివాసంలో చిన్నారులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు. జ్యామెట్రీ బాక్స్‌లు, బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు బహుమతులుగా...