ఐదు నెలల్లో 29 మంది మంది బలి.. గుంటూరు జిల్లా తురకపాలెం లో మరణాల మిస్టరీ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామం ఇటీవల ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా దళితవాడలో గత అయిదు నెలల్లో అసాధారణంగా మరణాలు జరగడం గ్రామస్థులను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 29 మంది మృత్యువాత పడ్డారు. అయితే గ్రామస్థుల వాదన ప్రకారం అసలు సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. జులై, ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయి. యువకులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో పరిస్థితులు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం...