ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే: జూలకంటి రంగారెడ్డి

కాకతీయ, వెంకటాపురం: ఆపరేషన్ కగార్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా హెలికాప్టర్లు, 35 వేల మంది సైన్యంతో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని గిరిజనుల రవాణా సౌకర్యం కోసం 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుజూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. యాకన్న గూడెం నుండి వెంకటాపురం వరకు అధ్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో...