మున్సిపాలిటి కార్మికుడి మృతిపై కేటీఆర్ ఆరా..!!
కాకతీయ, ములుగు : ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ జీతాలు రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగులమందు తాగి ఇటీవల మృతి చెందిన ఘటనపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రెడ్‌కో మాజీ చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఫోన్‌లో మృతుని తల్లితో మాట్లాడారు. మృతుని తల్లి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతం రాక మనస్థాపంలో కొడుకు మృతి చెందాడు అని, జీతం కోసం తిరిగి తిరిగి...