లంబాడీలు వంద శాతం ఎస్టీలే : లంబాడ జేఏసీ కో-కన్వీనర్ పోరిక రాహుల్ నాయక్
కాకతీయ, ములుగు : బంజారా, లంబాడీలు ఎస్టీలు కాదని ప్రచారం చేయడం సరికాదని లంబాడ జాయింట్ యాక్షన్ కమిటీ కో-కన్వీనర్ పోరిక రాహుల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ నాయక్ మాట్లాడుతూ తమ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ జరుగుతున్న ఈ విష ప్రచారం పూర్తిగా నిరాధారమైనది అని, బంజారా,లంబాడీలు క్రీస్తుపూర్వం నుండే భారతదేశంలో జీవనాధారాలు ఏర్పరుచుకొని ఈ నేలపుత్రులుగా ఉన్నారున్నారు. దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. చరిత్రలో దశకుమార చరిత్రలో బంజారాల జీవన విధానం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ‘నాయక్’ బిరుదు, హైదరాలీ...