స్థానిక ఎన్నికల్లో న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి: ఆవునూరి మధు

కాకతీయ, బయ్యారం : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించటం ద్వారా పేదల హక్కులకు రక్షణ కలుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అల్లిగూడెంలో ఏజెన్సీలో పార్టీ ముఖ్య నాయకుల జనరల్ బాడీ సమావేశం బానోత్ నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ఆవునూరి మధు హాజరై మాట్లాడారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో నియంతృత్వ ఫాసిస్టు విధానాలు అమలు జరుగుతున్నాయని, ఆపరేషన్ కగార్ పేర...