ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తా: ఎంపీ కడియం కావ్య
కాకతీయ, హనుమకొండ : నగరంలోని రాఘవేంద్ర కన్వెన్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రైవేట్ టీచర్స్ ఫెలిసిటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కావ్య, అనంతరం ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు....