కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిని బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని రాంచందర్ రావు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 22 నెలల పాటు...