ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.. ఇద్దరి బంధం బయటపడిందన్న కాంగ్రెస్.!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్ కు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఉపరాష్ట్రపతి పోలింగ్ మంగళవారం జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాక్రిష్ణన్ పోటీపడుతున్నారు. విపక్ష కూటమి తరపున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు కె. సురేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీఆర్ఎస్ నేత...