మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు మాస్టర్ ప్లాన్ వివరాలను సీఎం ముందుంచగా, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మేడారం మహాజాతర నాటికి ఆలయ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు సక్రమంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా...