10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా..!!
కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించామని, దానిలోని పోలింగ్ కేంద్రాల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించామని తెలపారు. అందిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాలో మార్పులు చేర్పులు...