రైతులకు వెంటనే యూరియా అందించాలి: మాజీ ఏమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
కాకతీయ, పెద్దపల్లి: ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు పని మానుకొని క్యూ లైన్లో రోజుల తరబడి నిల్చున్న రైతులకు సకాలంలో యూరియా లభించడం లేదని పెద్దపల్లి బీఆర్ఏస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున సుల్తానాబాద్ మండల కేంద్రంలో రైతులకు అవసరమైన యూరియా బీఆర్ఏస్ పార్టీ అధ్వర్యంలో ఇప్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి అయన మాట్లడుతూ.. రైతు లేనిదే రాజ్యం...