మహారాష్ట్రలో హైఅలర్ట్.. తీరానికి కొట్టుకొచ్చిన అనుమానాస్పద కంటైనర్లు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: మహారాష్ట్రలోని సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో అధికారులు హైలర్ట్ విధించారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గాన్ బీచ్ లకు మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని..అందులో ఏముందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో తీర గ్రామాలకు అలర్ట్ చేసి బీచ్ ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టినట్లు తెలిపారు. సముద్రంలో అధిక...