త్యాగాలు చేసేది కమ్యూనిస్టులే: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, షేక్ బాష్ మియా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కూనంనేని పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టులు నిస్వార్థ పరులని, వారి జీవితం ప్రజాసేవకే అంకితం అవుతుందని...