ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. అక్కడ జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో సంచలనంగా మారింది. సమాచారం తెలిసిన వెంటనే తోటి సిబ్బంది ఆమె చేతిలోని డబ్బా లాక్కొని, తహసీల్దార్ సొంత వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు, కల్పన గతంలో మండలానికి చెందిన కొంతమంది బంధువులకు...