ప్రమాదకరంగా జాతీయ రహదారి–163.. పట్టించుకోని పాలకులు, అధికారులు

కాకతీయ, ఆత్మకూర్ : హనుమకొండ - భూపాలపట్నం మార్గంలో ఉన్న జాతీయ రహదారి ఎన్ హెచ్ - 163 ప్రయాణికులకు శాపంగా మారింది. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఈ రహదారి పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా కటాక్షపూర్ చెరువు మత్తడి పైభాగంలో రహదారి గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు ప్రాణభయంతో ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల వర్షాలతో కటాక్షపూర్ చెరువు మత్తడి పైభాగం పూర్తిగా నీటమునిగిపోయింది. నీరు తగ్గిన తర్వాత రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. పెద్ద గుంతలలో నిలిచిన నీటితో వాహన చోధకులు గందరగోళానికి గురవుతున్నారు. రోడ్డు...