పారిశుధ్య కార్మికుని ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీలో వేతనాలు అందక, అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సఫాయి కార్మికుడు మైదం మహేష్ మరణంపై బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని విమర్శించారు. మున్సిపాలిటీలో ఐదు నెలలుగా వేతనాలు అందక, మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయిన మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. సోమవారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. ఏరియా హాస్పిటల్ నుండి బస్టాండ్ వరకు...