సైన్స్ ఫెయిర్లతో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత ..!!
కాకతీయ, సంగెం: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లు ఎంతో దోహదపడతాయని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వసుధ అన్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని నోట్రె డామ్ స్కూళ్లో తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణి ప్రాజెక్ట్ సంగెం మండలం కో ఆర్డినేటర్ రణధీర్ మాట్లాడుతూ ‘‘ప్రతి సంవత్సరం మేము ఇలాంటి సైన్స్ ఫెయిర్‌లను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తుమన్నారు. ఈ పరీక్ష కోసం తిమ్మాపురం ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్...