తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: డిప్యూటీ సీఎం

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అన్ని విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని వివరించారు. కర్ణాటక, హర్యానా వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలను కూడా అధిగమించడం తెలంగాణ సాధించిన గర్వకారణమని అన్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 33.64 శాతం సాధించడం అభినందనీయమైన...