తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశం.. మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగా బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ప్రజలకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని గుర్తు చేశారు. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో చరిత్రాత్మక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని...