ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కాకతీయ,గీసుగొండ : మండలం వంచనగిరిలోని ఆదర్శ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆమె స్వయంగా పరిశీలించి రుచి చూశారు. వంటకాల రుచిపై అసంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్, వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలోని బోధన, నిర్వహణ అంశాలపై కూడా ఆమె వివరాలు సేకరించారు. విద్యార్థుల అభ్యాసం, హాజరు తదితర అంశాలను సమీక్షిస్తూ మరింత...