జేఎన్ఎస్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

జేఎన్ఎస్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, క్రీడలు, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌ మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ.. అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన ఆన్లైన్ పరీక్షలో సుమారు 9 వేల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వీరందరికీ హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ...