మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన చల్లా

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన చల్లా కాకతీయ, పరకాల : కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి ని బుధవారం రోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మొగిలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.మొగిలి కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.