ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి

ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని కొండాపురం పెద్ద తండా గ్రామంలో ఓ ఒంటరి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపింది. మృతురాలు బాదావత్ లక్ష్మీ (45)గా గుర్తించారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం లక్ష్మీ భర్త తిరుపతి సుమారు 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, కూతురితో కలిసి జీవనాన్ని కొనసాగించింది. ఐదు సంవత్సరాల క్రితం కూతురు సంగీతకు వివాహం జరిపించింది. అనంతరం తాను ఒంటరిగా కూలీ పనులు చేసుకుంటూ...