విద్యార్దుల‌ ఎదుగుదలకు అవగాహాన.. గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మోటివేషన్ కార్యక్రమం

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి: పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యసాధన పట్ల అవగాహన కల్పించే ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం సిరి ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్‌, ర‌జనీ దేవి దంపతులు, ప్రిన్సిపాల్ విజయ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక, సైకాలజిస్ట్ తిరునగరి శ్రీహరి, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మాధం మహిపాల్, మోటివేషనల్ స్పీకర్ నరహరి నాయక్ లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంత‌రం మోటివేటర్లు ప్రసంగిస్తూ విద్యార్థులు కలలు కనడంలో...