కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వగ్రామమైన చింతమడక ప్రజలు ప్రత్యేక ఆహ్వానం అందించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు ఈనెల 21న జరగనున్న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని కవితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అని గర్వంగా పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వచ్చి బతుకమ్మ పండుగకు ఆహ్వానించడం తనకు...