ఖైదీల్లో ప‌రివ‌ర్త‌నే ల‌క్ష్యంగా కృషి చేయాలి: బండి సంజయ్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఖైదీల్లో ప‌రివ‌ర్త‌న తీసుకురావ‌డ‌మే జైళ్ల‌శాఖ సాధించే అసలైన విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. జైలు పరిపాలన అనేది కేవలం భద్రతకే పరిమితం కాకుండా, సంస్కరణ, పునరావాసానికి కూడా సాధనమని అన్నారు. ఈ దిశలో స్వచ్ఛత ,ఆరోగ్యం, విద్య, క్రీడలు లేదా కళలు వంటి పోటీలను నిర్వహిస్తూ జైళ్ల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, న్యూ ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో...