నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగవంతం

కాకతీయ, అమరావతి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న ఏపీ భవన్, ఎంబసీ అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటగా హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22...