మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..!!
కాకతీయ, పినపాక: మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా, ర్యాగింగ్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధనకై కృషి చేయాలన్నారు. పాల్వంచ (నవభారత్) కె ఎస్ ఎం ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ తెలిపారు. విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు,...