పోలీసులు మారకపోతే ప్రళయమే: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట
కాకతీయ, మంథని: రాజకీయ పార్టీలను, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో మంథని నియోజకవర్గంలో పోలీసులు మారక పోతే మంథని నుంచే ప్రళయం మొదలు అవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, దుద్దిళ్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలను చూపించడం పరిపాటిగామారింది. దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేకమార్లు అప్రమత్తం చేశామని ఆయన...