తెలంగాణ భారతదేశపు సీడ్ హబ్ గా మారింది: తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ, తెలంగాణ : హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025 లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మిట్ భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయం నకు భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం...