పేదలకు న్యాయ సలహా అందించడంలో ముందుంటా: మాదంశెట్టి సురేందర్

కాకతీయ, లక్షెట్టిపేట: పేద ప్రజలకు న్యాయ సలహా అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటానని తెలంగాణ రాష్ట్ర మాజీ అడిషనల్ డైరెక్టర్ మాదంశెట్టి సురేందర్ అన్నారు. మాదంశెట్టి సురేందర్ ఇటీవల పదవి విరమణ పొందడంతో, ఆవోప ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆర్యవైశ్యులకే కాకుండా పేద ప్రజలకు న్యాయ సలహాలు అందించడంలో తనవంతు కృషి ఎప్పుడూ ఉంటుందని, గతంలో సైతం తెలంగాణ రాష్ట్రంలో బాధితులకు న్యాయం అందించడం కోసం కృషి చేసానన్నారు. 30 సంవత్సరాల క్రితం ఏపీపీగా ఉద్యోగం సంపాదించుకున్న తాను...