ఆటో డ్రైవ‌ర్‌కు పోలీస్ క‌మిష‌న‌ర్ స‌న్మానం..!!

కాకతీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: కరీంనగర్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు పొందాడు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కనకం రాజేందర్ (40) గత ఆదివారం ఒక మహిళ ఆటోలో మరిచిపోయిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ను తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. వేములవాడ నుండి కరీంనగర్‌కు వచ్చిన ఓ మహిళ గీతాభవన్ వద్ద ఆటో దిగి ఆసుపత్రికి వెళ్తూ బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయింది. వెంటనే గమనించిన ఆటో డ్రైవర్...