కుటుంబ కలహాలతో అత్తను హత్య చేసిన అల్లుడు.!

కాకతీయ, వెంకటాపురం: ఇప్పలగూడెం గ్రామం గురువారం ఒక కుటుంబంలో నెలకొన్న వివాదం చివరకు రక్తపాతం వరకు దారితీసింది. సొంత అత్త కొండ గొర్ల ఎల్లమ్మ (వయసు 50) పై అల్లుడు విజయ్ దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం ప్రకారం మద్యం మత్తులో ఉన్న విజయ్, తన అత్తపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలో స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, కొంతకాలంగా కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు ఉన్నాయని, పరిస్థితి...