తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లైన్ పూర్తి అయితే తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని సీఎం పేర్కొన్నారు....