బీసీల కులగణనలో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాడు మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈ నెల 15 తేదీన కామారెడ్డి లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి అనసూయ సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి,...