అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ సిబ్బందిని స్మరించుకుంటూ, గురువారం (సెప్టెంబర్ 11) నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 1730లో రాజస్థాన్‌లో బిష్నోయి తెగకు...